రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలి. "మండల వ్యవసాయ అధికారి బి రామకృష్ణ"*
(ప్రజాగొంతుక.రిపోర్టర్.బాలకృష్ణ)ఫిబ్రవరి02::మద్దూరు(దూల్మిట్ట)
రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని, అక్రమ రవాణా మరియు విచక్షణ రహిత వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ ను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని మండల వ్యవసాయాధికారి బి రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్బంగా వారు మండలంలోని రైతులకు అవగాహన కల్పిస్తూ, స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన ఉన్న రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా నేరుగా బుకింగ్ చేసుకోవచ్చని, అవగాహన లేని రైతులు ఏఈఓలు లేదా గ్రామంలోని విద్యావంతుల సహకారంతో బుకింగ్ చేసుకోవచ్చని తెలియజేశారు. అదేవిధంగా యాప్ ద్వారా బుక్ చేసిన 24 గంటల్లో రైతులు యూరియా కొనుగోలు చేయాల్సి ఉంటుందని, నిర్ణీత సమయంలో కొనుగోలు చేయకపోతే బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని తెలిపారు. ఎటువంటి సందేహాలు ఉన్న దగ్గర్లో వ్యవసాయ అధికారిని కలిసి తప్పకుండా ఫర్టిలైజర్ యాప్ ద్వారానే రైతులు కొనుగోలు చేయాలన్నారు. ఇలా చెయ్యడం ద్వారా అక్రమ యూరియా, అక్రమ రవాణా, నిల్వల దుర్వినియోగం, అవసరానికి మించిన వినియోగం వంటి సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి సులువుగా ఉంటుందని అన్నారు. మునుపటి వలె నేరుగా ఎరువుల దుకాణం వద్దకి వెళితే యూరియా ఇవ్వడం జరగదని పేర్కొన్నారు. యూరియా బుకింగ్‌కు భూమి రికార్డులకు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి అని ఆ నంబర్ కి వచ్చే ఓటిపి ద్వారా రైతులు బుకింగ్ చేసుకుని కొనుగోలు చేయాలన్నారు. వారి వెంట మండల రైతులు, ఏఈఓ రాజు తదితరులు ఉన్నారు.












