బిజెపి పార్టీని ఆదరించండి అభివృద్ధి చేస్తాo
*-బిజెపి ప్రధాన కార్యదర్శి డి కె స్నిగ్ధ రెడ్డి కోరారు.*
*- 28వ వార్డు బిజెపి అభ్యర్థి అమర్నాథ్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు.*
గద్వాల మున్సిపాలిటీకి జరిగే ఎన్నిక లలో కమలం గుర్తుకు ఓటు వేసి అత్య ధిక మెజారిటీతో గెలిపించాలని 28వ వార్డు బిజెపి అభ్యర్థి అమర్నాథ్ ను గెలిపించాలని ఓటర్లను బిజెపి ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధ రెడ్డి కోరారు. సోమవారం 22వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అమర్నాథ్ను గెలిపిస్తే వార్డులో ఉన్న సమస్యలను పరిష్క రించడానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీ.కే అరుణమ్మ సహాయ సహకారాలతో వార్డు అభివృద్ధికి ఎల్లవేళలా అందు బాటులో ఉంటామని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు అభ్యర్థి అమర్నాథ్, బిజెపి ఇన్చార్జి ఓఎస్ రెడ్డి, బండల వెంకట్ రాములు బండల పద్మావతి కార్యకర్తలు పాల్గొ న్నారు.












