E-PAPER

10వ తరగతి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొవాలి

Date : 02 February 2026, 5:46 pm Posted By : PRAJA GONTHUKA

10వ తరగతి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొవాలి

10వ తరగతి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మవిశ్వాసంతో చదివితే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించగలరని

డీఆర్డీఏ –ఎజిఎమ్ఏమ్ ట్రైనర్ మహేశ్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సోమవారం గద్వాల మండలం పూడూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ ఎస్ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల కోసం విద్యా ర్థుల విజయానికి దిక్సూచి సమయ పాలన – ప్రేరణ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజూ చదువుకు షెడ్యూల్ రూపొందించుకొని,దానికి కట్టుబడి ముందుకు సాగితే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధ్యమవుతాయని సూచించారు. అలాగే ఆత్మవి శ్వాసం,పట్టుదల, ఏకాగ్రత ఉంటే విద్యార్థులు ఏ స్థాయికైనా చేరుకోగలరని ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో సమయ పాలన ఎంతో ముఖ్య మని,లక్ష్యాన్ని గోడపై రాసి ప్రతిరోజూ చూసుకుంటే అది విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. వైఫల్యం అనేది గమ్యం కాదని, విజయానికి దారి చూపే ఒక దశ మాత్రమేనని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల జిహెచ్ఎం రామన్న,వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :