ఇబ్రహీంపూర్ సందర్శించిన తపస్పల్లి నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం.
ప్రజా గొంతుక కొమురవెల్లి : మండల కేంద్రంలోని తపస్పల్లి నూతన పాలకవర్గం ఆదర్శ గ్రామమైన ఇబ్రహీంపూర్ గ్రామాన్ని బస్సులో వెళ్లి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట కనకరాజు మాట్లాడుతూ ఆదర్శ గ్రామమైన ఇబ్రహీంపూర్ గ్రామంను సందర్శించడం జరిగిందన్నారు. అలాగే మన తపస్పల్లి గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గద్ద మురళి కృష్ణ, ఉప సర్పంచ్ వెలుగు నరసింహులు, వార్డు సభ్యులు కంకణాల నందు, ఏల శిరీష, గుర్రాల నరసింహులు, కొండపాక లచ్చవ్వ, కంకణాల భాగ్య, కంకణాల ప్రవీణ్, మేలుగు చంద్రమౌళి, CA రుద్రారం చైతన్య, ఈగ కళ్యాణి, అంగన్వాడి టీచర్ నాగమల్ల స్వప్న, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణాకర్, వాటర్ మాన్ కంకణాల సిద్ధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.











