E-PAPER

సిట్ నోటీసుల జారీ ని ఖండిస్తూ చెన్నారావుపేటలో ర్యాలీలు.

Date : 01 February 2026, 8:14 pm Posted By : PRAJA GONTHUKA

సిట్ నోటీసుల జారీ ని ఖండిస్తూ చెన్నారావుపేటలో ర్యాలీలు.

*సిట్ నోటీసుల జారీ ని ఖండిస్తూ చెన్నారావుపేటలో ర్యాలీలు.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 01 ఫిబ్రవరి 2026.

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు , నర్సంపేట అభివృద్ధి ప్రదాత ,గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ,

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ, నేడు చెన్నారావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో ర్యాలీ, నిరసన ధర్నా మరియు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న రెడ్డి నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న రెడ్డి మాట్లాడుతూ ,

• ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అయిన కేసీఆర్ గారిపై అక్రమ కేసులు, సిట్ నోటీసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు.

• తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమేనని ఆమె ఆరోపించారు.

• పాలనలో రెండేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేని సీఎం అనుముల రేవంత్ రెడ్డి , పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాన్ని అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. సిట్ నోటీసులు చట్ట పరమైనవి కావని, పూర్తిగా రాజకీయ ప్రేరణతో కూడినవేనని స్పష్టం చేశారు.

• కక్ష రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించరని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న రెడ్డి హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో: మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్ ,మండల అధికార ప్రతినిధి.మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు. మండల ప్రధాన కార్యదర్శి లు.మాజీ సొసైటీ చైర్మన్.కో ఆప్షన్ మెంబర్, మండల కమిటీ సభ్యులు. మండల సీనియర్ నాయకులు.మండల యూత్ నాయకులు.బిఆర్ఎస్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు.కార్యకర్తలు,యూత్ నాయకులు,మండల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు.పార్టీ శ్రేణులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ గారిపై జారీ చేసిన సిట్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్