ఘనంగా శివస్వాముల మహా పడిపూజ
*అంగరంగ వైభవంగా పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగ మహా పడిపూజ.*
కులకచర్ల,ప్రజా గొంతుక న్యూస్: వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాల మహా పడిపూజ మహోత్సవము గురు స్వామి సమక్షంలో బండ వెలికిచర్ల గురు స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ గురుస్వామి ఆధ్వర్యంలో తన గాన గంధర్వంతో పరమ శివుని స్మరిస్తూ భక్తి పాటలతో భక్తులను పరవ సింపజేశారు.పరమ శివునికి ప్రీతిపాత్రమైన ఇరుముడులు కట్టుకొని శివరాత్రికి శ్రీశైలం బయలు దేరుతారని సూచించారు. ఈ పూజ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు భీంరెడ్డి,దేవాలయ చైర్మన్ మహిపాల్ రెడ్డి,గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ మడుగు శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ ఆనందం,వార్డు సభ్యులు,దేవాలయ సిబ్బంది, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు రాజు నాయక్,శంకర్ స్వామి, రాజు,వివిధ గ్రామాల నుంచి వచ్చిన శివ స్వాములు,గ్రామ మహిళలు,యువకులు, చిన్నారులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












