కెసిఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు మానుకోవాలి
*ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్షాలపై రేవంత్ కుట్ర*..
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఫిబ్రవరి 01:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని మాణిక్యమ్మ గూడలో.. పిఎసిఎస్ వైస్ చైర్మన్ డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో... కెసిఆర్ కి సీట్ నోటీసులు ఇవ్వడం పట్ల మండిపడ్డారు ఎన్నికలవేళ ప్రజల దృష్టిని మళ్లించే అందుకే కేసిఆర్ కు సీట్ నోటీసులు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ లు అమలు చేయలేక బిఆర్ఎస్ పై ఎదురుదాడి అంటూ రాజుల కాలంలో కూడా గూడచర్ల వ్యవస్థ ఉండేది ఇంటలిజెన్స్ సంస్థలు ఎప్పుడైనా అసాంఘిక శక్తుల ఫోన్లను టాపింగ్ చేయడం సర్వసాధారణం దానికి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం ఉండదు కానీ ఆనాటి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి అరెస్టు చేసేందుకు విచారణ పేరిట కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు కేసీఆర్ పై సిట్ విచారణను నిరసిస్తూ ఆదివారం మాణిక్యమ్మ గూడా గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చవలసింది పోయి ప్రతిపక్షాలను టార్గెట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ నటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేయాలి ఎలాంటి పథకాలు తేవాలి ఎలా అభివృద్ధి చేయాలి అన్నది పక్కన పెట్టి ప్రతిపక్షాలను ఎలా టార్గెట్ చేయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు ఉద్యమం ద్వారా తెలంగాణను తీసుకొచ్చి పదేళ్ల పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణ అభివృద్ధికి పాటుపడిన కెసిఆర్ ను విచారించడం ఎన్నికల ముందు జరుగుతున్న కుట్రని అన్నారు ఎన్నికల ముందే ఇలా ఎందుకు చేయాల్సి వస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కుట్ర ను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని అన్నారు పిఎసిఎస్ చైర్మన్ డి వెంకట్ రెడ్డి తో పాటు గ్రామ శాఖ అధ్యక్షులు వి దావీదు గ్రామ సర్పంచ్ పద్మకృష్ణ మరియు ఉప సర్పంచ్ దయాకర్ రెడ్డి మరియు వార్డు మెంబర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది












