E-PAPER

జిల్లా అధ్యక్షుడు గా మహాదేవుని శ్రీనివాస్.

Date : 01 February 2026, 6:30 pm Posted By : PRAJA GONTHUKA

జిల్లా అధ్యక్షుడు గా మహాదేవుని శ్రీనివాస్.

జిల్లా అధ్యక్షుడు గా మహాదేవుని శ్రీనివాస్.

ప్రజా గొంతుక కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కేంద్రంలో వీరశైవ లింగాయత్ సమాజం భవనంలో పట్టణ అధ్యక్షుడు నరుకుల శివప్ప, జిల్లా గౌరవాధ్యక్షుడు భద్రప్ప ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కమిటీ ఎన్నికలలో గౌరవ జిల్లా అధ్యక్షుడు గా ఆకుల భద్రప్ప అధ్యక్షుడు గా మహాదేవుని శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆకుల ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల మరియు ప్రతినిధుల సమక్షంలో ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గా ఎన్నికైన మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ పదవి అనేది బాధ్యత అన్ని వర్గాలను కలుపుకొని జిల్లా సమాజం అభివృద్ధి కోసం పాటుపడతానని,సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని సిద్దిపేట పట్టణ గౌరవ అధ్యక్షుడు శివప్ప మరియు జిల్లా గౌరవాధ్యక్షుడు భద్రప్ప సహకారం మరియు పట్టణ కమిటీ సభ్యుల సహకారం మరియు జిల్లాలో ప్రతి ఒక్క వీరశైవుని సహకారంతో సమాజ అభివృద్ధికి పాటుపడతానని జిల్లా లో రుద్రభూమి ఏర్పాటుకు మరియు బసవ భవనం ఏర్పాటుకు రాష్ట్రంలోని పెద్దల సహకారం తీసుకొని ముందుకు సాగుతానని సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా తన ఎంపికకు సహకరించిన జిల్లాలోని వీరశైవులందరికీ రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆకుల భద్రప్ప,పట్టణ గౌరవ అధ్యక్షుడు, నరుకుల శివప్ప, పట్టణ అధ్యక్షుడు గౌరీ శంకర్, మరియు పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులు వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్