జాతీయ రహదారిపై గులాబీ శ్రేణుల రాస్తారోకో
రాయపర్తి, ఫిబ్రవరి 1 ప్రజా గొంతుక
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో గులాబీ శ్రేణులు బైఠాయించారు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టిందని నినాదాలు చేశారు, కెసిఆర్ కు సీట్ నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు అన్నారు, వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు,












