*కెసిఆర్ పై చేస్తున్న రాజకీయ వేధింపులకు* *నిరసనగా ర్యాలీలు.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్ ) , 31 జనవరి 2026.
కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు నిరసనగా , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ,
బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న .
ఈ సందర్భంగా మాట్లాడుతూ ,
గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్) ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ,
తేదీ 01-02-2026 చెన్నారావుపేట మండల కేంద్రంలో ఉదయం:9:00 గంటలకు ర్యాలీ నిర్వహించి , ధర్నా , నిరసన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు. మండల నాయకులు. ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,మండల యూత్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామా యూత్ నాయకులు.కార్యకర్తలు పార్టీ శ్రేణులు.అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి.
మీ
*బాల్నే వెంకన్న*
మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు.
చెన్నారావుపేట మండలం.












