*నేడు నాదర్ గుల్ కు కెఎల్ఆర్ రాక*
*రోడ్ల విస్తరణ, నాలాలు, సమస్యల పరిశీలన*
*ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వినతి*
*హైదరాబాద్ తోపాటు జిహెచ్ఎంసి డివిజన్ల అభివృద్ధి: కిచ్చెన్న*
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం జనవరి 31:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మండల కేంద్రంలోని నాదర్ గుల్ గ్రామంలో రోడ్ల వెడల్పు- మరమ్మతులు, గ్రీన్ హోమ్స్ లో ట్రంక్ లైన్, సున్నం చెరువు నాలా విస్తరణ, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, ఇంటర్- డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం కేఎల్ఆర్ కు వినతి పత్రం అందించారు.మందమల్లమ్మ- బాలాపూర్- బడంగ్ పేట- నాదర్ గుల్- ఆదిభట్ల రేడియల్ రోడ్డు విస్తరణకు కరెంట్ స్థంబాలు అడ్డంగా ఉన్నాయని... వాటిని తొలగించాలని కిచ్చెన్నకు నాదర్ గుల్ కాంగ్రెస్ లీడర్లు విజ్ఞప్తి చేశారు.పూర్తి సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం నాదర్ గుల్ గ్రామానికి వచ్చి స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు 7 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉందని మాజీ సర్పంచ్ మర్రి హనుమంతరెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి, పుట్టగళ్ల జగన్, ఆనంద్ రెడ్డి, సుభాన్ యాదవ్, బంగారి అశోక్, యాతం కుమార్ యాదవ్, మర్రి లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, నాగరాజు, శేఖర్, వెంకటేష్ యాదవ్, వెంకటేష్ గౌడ్ తెలిపారు.కాలనీలతో విస్తరించిన నాదర్ గుల్ గ్రామంలో 50 హైమాస్ లైట్లను ఎస్ డిఎఫ్ నిధుల కింద త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాదర్ గుల్ కాంగ్రెస్ నాయకులు సహా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.












