ప్రజా దర్బార్ తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన
*- వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగరాజు*
*- ఎమ్మెల్యే అభ్యర్థి గోపాల్
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండల కేంద్రం శాంతినగర్ పట్టణంలో ప్రజా దర్బార్ దినపత్రిక తెలుగు దినపత్రిక క్యాలెం డర్ను ఆవిష్కరించిన బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ మరియు వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగరాజు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.వారు మాట్లాడుతూ.. పత్రిక అనేది సమాజానికి ప్రభుత్వానికి మధ్య వారధిగా కీలకపాత్ర పోషిస్తుంది అన్నారు. అలాగే దినపత్రి కలు ప్రజాస్వామ్యా నికి పట్టుకొమ్మలు వంటివని సమాజంలో జరిగే ఎటువంటి విషయాలను ప్రజల ముందు ఉంచడానికి ఈ పత్రికలు ఎంతో ఉపయోగపడతా యని ప్రజలను చైతన్యం కలిగించడానికి దినప త్రికలు ఎంతో అవసరమని ప్రజ లను రాజకీయాలకు సంబంధించిన విషయాలను తెలియచేయడంలో ఇవి ఎంతో క్రియాశీలక పాత్ర వహిస్తాయని దినపత్రికలు నిస్వార్ధంగా విస్పక్ష పాతంగా సమాజంలో జరిగే ఎటువంటి విషయా లను ప్రచురించాలని ఎవరి యొక్క ఒత్తిళ్లకు తలొక్కకూడదని అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం కొనసాగ పడుతుందని తెలియజేశారు. అందుకే ప్రజా స్వామ్యానికి దినపత్రికలు ఎంతో ఉపయోగకరంగా రాజకీయాల పట్ల అవగాహన కలగడానికి ఇవి ప్రయ త్నిస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి టౌన్ అధ్యక్షులు బోయరామకృష్ణ,వడ్డేపల్లి మండలం ఓబిసి మోర్చా అధ్యక్షులు పరశురా ముడు,జక్కిరెడ్డిపల్లి రాఘవేంద్ర,తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.












