*ఆర్థిక సహాయం అందజేసిన గొల్ల సత్యమ్మ సాయన్న గ్రామ కార్యదర్శి శోభ*
గండీడ్ జనవరి 30
ప్రజా గొంతుక న్యూస్
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్
మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయిని అంజిలయ్య అనారోగ్యంతో మృతి చెందిన సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గొల్ల సత్యమ్మ సాయన్న గ్రామ కార్యదర్శి శోభ స్థానిక నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం 10000 రూపాయలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ గొల్ల సత్యమ్మ సాయన్న, గ్రామ కార్యదర్శి శోభ, గాజుల మల్లప్ప, గాజుల అంజిలయ్య బీస్ కృష్ణారెడ్డి, గాజుల కృష్ణయ్య, బోడి వెంకటయ్య, బీస్ మోహన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.












