విద్యా యోధుడు 'దయాల్'కు అరుదైన గౌరవం
ప్రజా గొంతుక న్యూస్ జనవరి 30/ కొత్తగూడెం (కలెక్టరేట్):
నిబద్ధతతో కూడిన పనితీరు, నిస్వార్థ సేవా దృక్పథం ఎప్పుడూ గుర్తింపును తెచ్చిపెడతాయని మాజీ ఎంఈఓ డాక్టర్ దయాల్ మరోసారి నిరూపించారు. కొత్తగూడెం మండల విద్యాశాఖలో ఆయన సృష్టించిన గుణాత్మక మార్పులను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తూ లేఖ రాశారు. ఈ ప్రశంసా పత్రాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దయాల్‌కు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు దయాల్ అందించిన మౌలిక సూచనలు అమోఘమని కొనియాడారు. ఆయన కర్తవ్య పరాయణత జిల్లాలోని మిగిలిన అధికారులకు దిక్సూచి వంటిదని పేర్కొన్నారు.












