నియోజకవర్గ క్రీడా పోటీలకు ఎంపికయిన రామాజీపేట విద్యార్థినిలు
ప్రజ గొంతుక న్యూస్ రాయికల్
సీఎం కప్ జగిత్యాల నియోజకవర్గ పోటీలకు రాయికల్ మండల రూరల్ క్రీడలు కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ అథ్లెటిక్ పోటీల్లో సత్తా చాటి నియోజక వర్గ క్రీడా పోటీలకు రామాజీపేట ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఎంపిక అయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి తెలిపారు. వీరిని ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్ మరియు ప్రజా ప్రతినిధులు అభినందించారు.












