చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు.
ప్రజా గొంతుక చేర్యాల : రెండవ సాధారణ ఎన్నికల్లో నామినేషన్ సెంటర్ ను హుస్నాబాద్ ఏసీపీ సదానందం పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినిగించుకోవాలని అలాంటి గొడవలకు పాలు పాల్పడకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేందర్, చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రమేష్, ఎస్సై నవీన్, కొమురవెల్లి ఎస్ఐ తోట మహేష్, పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












