రాష్ట్ర సమాచార కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన "సమాచార హక్కు సేవా సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు బాబురామ్ నాయక్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:29
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ ( దేశాల భూపాల్)ని "సమాచార హక్కు సేవా సొసైటీ" ( రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ ) వ్యవస్థాపక అధ్యక్షులు (చైర్మెన్ ప్రెసిడెంట్ ) కేతావత్ బాబురామ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో, కమిషనర్ కి శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బాబురామ్ నాయక్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ యాక్ట్) ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడానికి తమ సొసైటీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. సామాన్య ప్రజలకు చట్టం పట్ల అవగాహన కల్పించడంలో కమిషన్ అందిస్తున్న సహకారం గొప్పదన్నారు. రాబోయే రోజుల్లో సమాచార హక్కు చట్టాన్ని మరింత బలోపేతం చేసి, ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని వారు కమిషనర్ ని కోరారు.












