సమ్మెకు సన్నద్ధమవుదాం.......సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:28
నరేంద్ర మోడీ కార్మిక కర్షక వ్యవసాయ కూలీలకు నష్టపరిచే విధంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు పరచాలని విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు పిలుపునిచ్చారుత్రిపురారం మండలం పెద్దదేవలపల్లిలో రెడ్డీస్ ల్యాబ్ యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పదవి విధానాన్ని రూపుమాపి 12 గంటలు 14 గంటలు చేయించే విధంగా లేబర్ కోడ్లను తీసుకొచ్చారని దీని ద్వారా కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున నష్టం జరిగి కార్పొరేట్ సంస్థలకు లాభం జరిగే విధంగా ఉన్నాయన్నారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ముక్కు పిండి రైతుల వద్ద నుండి కరెంట్ బిల్లును వసూలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పండుతుందన్నారు వి బి జి రామ్ జి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉపాదామీని నిర్వీర్యం చేయటం కొరకు రాష్ట్రాలపై భారాల మోపుతుందని తక్షణమే చట్టాన్ని రద్దు చేయాలన్నారు రాజకీయాలకతీతంగా ఫిబ్రవరి 12న జరిగే దేశభక్తి సమ్మెలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో రెడ్డి స్లాబ్ యూనియన్ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ నాయకులు రాములు సైదులు లింగయ్య తదితరులున్నారు











