సమ్మక్క సారాలమ్మ గద్దేలకు చేరిన కంకవనం.
ప్రజగొంతుక (జనవరి 28)కాల్వ శ్రీరాంపూర్ : మండలం లోని మీర్జాం పెట గ్రామం లోని సమ్మక్క జాతర పనులు ప్రారంభం అయినాయి. జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కంకవనాన్ని గ్రామం నుండి డప్పు సప్పుల ఊరేగింపుతో, మహిళా మణులతో మంగళహారతుల మధ్యన, అంగరంగ వైభవంగా కంకవనాన్ని జాతర గద్దెల వరకు చేర్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శైలజ, సదానందం, ఆలయ కమిటీ చైర్మన్ అశోక్ గౌడ్, అభివృద్ధి కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఆలయ జాతర కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.













