బ్యూటిఫుల్ లైఫ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
ప్రజా గొంతుక ప్రతినిధి/ దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామంలో గల ఓ నిరుపేద కుటుంబానికి స్థానికంగా గల బ్యూటిఫుల్ లైఫ్ ఫౌండేషన్ చిరు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచింది.వివరాల్లోకి వెళితే పడిదల నరసింహారావు (45) అనే వ్యక్తికి తలలో రక్తం గడ్డ కట్టగా ఆపరేషన్ కోసం 2లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని సంబంధిత వైద్యులు చెప్పడంతో రెక్కడితే గాని డొక్కాడని ఆ కుటుంబం దాతలకోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసి బ్యూటిఫుల్ లైఫ్ పౌండేషన్ నిర్వాహకులు స్పందించారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహారావు యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్ పేద్వారా బిఎల్ఎఫ్ గౌరవ సభ్యులందరి తరపున చిరు సాయంగా 2500/-రూ పంపించి ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. బిఎల్ఎఫ్ జాయింట్ సెక్రటరీ పొడుతూరి రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మనిషిగా పుట్టినందుకు బాధ్యతగా అభాగ్యులకు అండగా నిలబడదాం మానవత్వాన్ని కాపాడుకుందాం అని వారి నినాదం చెప్పడం జరిగింది. ఆర్థిక సహకారం అందిస్తున్న తోటి బిఎల్ఎఫ్ గౌరవ సభ్యులందరికీ వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు.












