E-PAPER

ఎస్‌జీఎఫ్ అండర్–17 జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీల్లో టైమ్ స్కూల్ విద్యార్ధినులు

Date : 27 January 2026, 7:52 pm Posted By : PRAJA GONTHUKA

ఎస్‌జీఎఫ్ అండర్–17 జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీల్లో టైమ్ స్కూల్ విద్యార్ధినులు

ఎస్‌జీఎఫ్ అండర్–17 జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీల్లో టైమ్ స్కూల్ విద్యార్ధినులు

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:27

ఎస్‌జీఎఫ్ అండర్–17 జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టైమ్ స్కూల్ విద్యార్థినులు

మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్లో జనవరి 28 నుంచి 31, 2026 వరకు నిర్వహించనున్న ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ) అండర్–17 జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీల్లో టైమ్ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొనడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.

టైమ్ స్కూల్ విద్యార్థినులు కె. డింపుల్ గీత, కె. ఐశ్వర్య రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. వీరు తెలంగాణ జట్టులో భాగంగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా టైమ్ స్కూల్ డైరెక్టర్లు మందా నరేందర్ రెడ్డి, కత్తి కోటి రెడ్డి విద్యార్థినులను ఘనంగా అభినందించారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్లే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సత్తా చాటగలుగుతున్నారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

కఠిన సాధన, క్రమశిక్షణ, ఉపాధ్యాయులు మరియు కోచ్‌ల సమర్థ మార్గనిర్దేశంతోనే ఈ విజయం సాధ్యమైందని విద్యార్థినులు తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చి తెలంగాణ రాష్ట్రానికితో పాటు టైమ్ స్కూల్ పేరు దేశవ్యాప్తంగా వెలుగొందేలా కృషి చేస్తామని వారు తెలిపారు.

ఈ ఘనత సాధించిన విద్యార్థినులకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్