పాత్రికేయులకు తాసిల్దార్ సన్మానం, డైరీ అందజేత.
ప్రజా గొంతుక (జనవరి 26) కాల్వ శ్రీరాంపూర్: సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జగదీశ్వర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం స్వతంత్ర సమరయోధుడు రాజేశ్వరరావు ను శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం తహసిల్దార్ పాత్రికేయులకు 2026 నూతన సంవత్సర డైరీలను అందజేశారు.సీనియర్ పాత్రికేయుడు చంద్రమౌళిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, లంక సదయ్య, శ్రీనివాస్,మాదాసు సతీష్,ప్రజాప్రతినిధులు,అధికారులు పాత్రికేయులు ఉన్నారు.












