అంగన్వాడి పిల్లలకు ప్లేట్లు పంపిణీ ...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడవ అంగన్వాడి లో ఉన్న పిల్లలకు కొన్నే గ్రామ సర్పంచ్ కోడూరి స్వర్ణలత శివకుమార్ గౌడ్ ఉపసర్పంచ్ చల్ల కమలాకర్ ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదువుతూనే ఉన్నంత శిఖరాలకు ఎదగాలని, ఆకాంక్షతో తమకు తోచిన విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పిల్లలకు ప్లేట్లు గ్లాసులు అందజేయడం జరిగిందని రానున్న రోజుల్లో మరింత సహాయం చేయడానికి ముందు ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఆగయ్య గౌడ్, రిటైర్డ్ ఆర్మీ కుందారం అంజనేయులు, వార్డు సభ్యులు ప్రదీప్,పసుల వీరం జవ్వాజి అది నారాయణతదితరులు పాల్గొన్నారు.














