గాయత్రి పబ్లిక్ స్కూల్ లో 77వ. గణతంత్ర దినోత్సవ వేడుకలు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 26 జనవరి 2026.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామంలో గల గాయత్రి పబ్లిక్ స్కూల్ లో 77వ. రిపబ్లిక్ (గణతంత్ర దినోత్సవం) ను ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి . విష్ణు బాబు మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఏటా జనవరి 26న జరుపుకునే ఒక ప్రధాన జాతీయ పండుగ అని , 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి, దేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన జ్ఞాపకార్థం దీనిని జరుపుకుంటామని , ఈ రోజున ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వ విధానం (గణతంత్రం) అమల్లోకి వచ్చిందని ,
1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, స్వంత రాజ్యాంగం ప్రకారం 1950 జనవరి 26 నుంచి దేశ పాలన మొదలైందని ,
దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్య విలువలను, సమైక్యతను చాటిచెబుతుందని ,
ఈ రోజును దేశవ్యాప్తంగా జాతీయ సెలవుదినంగా పాటిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి. అమర్ రాజ్ , ఎం. ప్రియాంక , సి హెచ్ మమత మరియు దేవేందర్, నర్సమ్మ, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.












