ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రజాగొంతుక భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి : భీమారం మండలం లోని దంపూర్ గ్రామ పంచాయతీ లోని గ్రామ పంచాయతీ,ప్రాధమిక పాఠశాల లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. తర్వాత పాఠశాల లో ఆటల పోటీలలో గెలుపొందిన పిల్లలలకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ చెగొండ కొమురయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో *మేర గావ్ మేర ధరహార్* సభ నిర్వహణ లో భాగంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామం లోని పూర్వ గ్రామ సంపద ను గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని, గ్రామం లో ఉన్న ఇబ్బందులను గుర్తించి పరిష్కరించుకోవాలని తెలియజేసారు. గ్రామం మధ్యలో ఉన్న చెరువును అభివృద్ధి చేసుకొని అక్కడ మినీ ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ లను ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం లో నడిపించుకోవాలని అన్నారు. బాల వికాస ఆధ్వర్యంలో జరిగిన తాగునీటి పరిశీలన లో నీరు తాగాడానికి అనువైనదిగా లేదని ఈ సమస్య ఫై కృషి చేసి పరిష్కరిస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్, వార్డుమెంబెర్స్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












