నేటీ బాలలే రేపటీ పౌరులు.....అమీర్ అలి ఫౌండేషన్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:26
గణతంత్ర దినోత్సవం సందర్బంగా మిర్యాలగూడ మండలం దుర్గా నగర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు అమీర్ అలి ఫౌండేషన్ సభ్యులు జానిపాష చాంద్ సుల్తాన దంపతుల ఆధ్వర్యంలో ప్లేట్స్ పంపీణి చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులు గా ఫాతిమా ఎన్వి్రాన్మెంటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫాండర్ ఎండీ పర్వేజ్ మరియు చెన్ను నర్సింహా రెడ్డి పాల్గొన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు మాట్లాడుతూ అమీర్ అలి ఫౌండేషన్ వారు మా పాఠశాల విద్యార్థులకూ ప్లేట్స్ పంపీణీ చేసి భవిష్యత్ లో ఫౌండేషన్ తరుపున వారి సేవలని అందిస్తామని ముందుకురావడం అభినందనీయం అన్నారు పర్వేజ్ మాట్లాడుతూ శ్రమ మన ఆయుధం సేవ మన లక్ష్యం అనే నినాదం తో అమీర్ అలి ఫౌండేషన్ పలురకాల సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకి ఆదర్శం గా నిలుస్తూన్నారని అన్నారు ఈ కార్యక్రమం లో అమీర్ అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్ అలి మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి మా వంతుగా సేవ చేసుకునే అదృష్టం ఆవకాశం కల్పించిన పర్వేజ్ కి ధన్యవాదాలు అత్యవసర పరిస్థితి లో రక్తదానం చేస్తూన్న రక్తదాత చెన్ను నర్సింహా రెడ్డి మా ఆహ్వానం మన్నించి ఈరోజు సేవా కార్యక్రమం లో పాల్గోని విద్యార్థులకి ఫ్రూట్స్ అందించటం జరిగింది ప్రధానోపాధ్యాయులు వేణు పొట్టిమూర్తి శేఖర్
చెన్ను నర్సిరెడ్డి కుంచం శ్రీను
యం. ఏ లతీఫ్ జానిపాష చాంద్ సుల్తాన మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు












