E-PAPER

అహింసా పద్ధతిలో మహాసంగ్రామం గెలిచాం 

Date : 26 January 2026, 1:08 pm Posted By : PRAJA GONTHUKA

అహింసా పద్ధతిలో మహాసంగ్రామం గెలిచాం 

అహింసా పద్ధతిలో మహాసంగ్రామం గెలిచాం

దేశ ప్రగతికి బలమైన పునాదులు వేసిన మాజీ ప్రధాని నెహ్రూ..

జాతీయ జెండా ఎగరవేసిన నక్క వాని గూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాన్రాజ్ రవీందర్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

స్వాతంత్ర్య పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గంనీ కాంగ్రెస్ పార్టీ చూపిందని నక్క వాని గూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాన్రాజ్ రవీందర్ అన్నారు. నక్కవానిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసా పద్ధతిలో మహాసంగ్రామం గెలిచామని పేర్కొన్నారు. పటిష్ట భారత్‌ కోసం మాజీ ప్రధాని నెహ్రూ ఎన్నో చర్యలు చేపట్టారు. నెహ్రూ హయాంలోనే దేశ ప్రగతికి బలమైన పునాదులు పడ్డాయి. పంచవర్ష ప్రణాళికతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారు అన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ, గృహజ్యోతి పథకం, సబ్సిడీ గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్, వంటి అనేక కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. ఈ కార్యక్రమంలోమాజీ అధ్యక్షుడు బోడపట్ల ఐలయ్య, ఉపాధ్యక్షులుగోదాలపరశురాములు,ప్రధాన కార్యదర్శి గోదాల సంపత్, బొట్టు గణపతి, సహాయ కార్యదర్శులు చంద్రయ్య, కోశాధికారి అమృత రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్