రిపబ్లిక్ డే వేడుకల్లో బిఆర్ఎస్ నాయకులు
జాతీయజెండా ఎగరవేసిన గంధ మల్ల నరేందర్...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బచ్చన్నపేట పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ గద్దె వద్ద జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్ మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. గత బిఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోపరిపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని, గతంలో కరువు నేల అయిన తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.












