పూజరుల పై అనుచిత వాక్యాలు సరైన పద్ధతి కాదు.
రాష్ట్ర సంఘం అధ్యక్షులు, సతీష్ శర్మ.
ప్రజా గొంతుక జనవరి 24 కాల్వ శ్రీరాంపూర్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవాలయ అర్చకులను, అనుచిత వ్యాఖ్యలతో దూషించడం, సరైన పద్ధతి కాదని రాష్ట్ర సంఘం అధ్యక్షులు సతీష్ శర్మ తీవ్రంగా ఖండించారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం లో పాత్రికేయుల తో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగరాజు, అలాగే రాష్ట్ర దీప దుపా నైవేద్య అర్చకులు నిట్టూరి సతీష్ శర్మ మాట్లాడుతూ మహా ప్రసిద్ధిగాంచిన కొండగట్టు పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు పూజలు చేస్తున్న పూజారుల పై కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంత్ , పూజారుల పైన ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యల తో కూడిన మాటలు మాట్లాడడం సరియైన పద్ధతి కాదని, దీనిని దీప ధూప నైవేద్యం రాష్ట్ర సంఘ నాయకుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దీప దుపా సంగం లో పూజారులుగా ఆరువేల పైగా పనిచేస్తున్నామని, అర్చకుల అన్యాయంగా దూషించిన ఈవో క్షమాపణలు తెలపాలని,లేని యెడల తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. తెలంగాణలో ఏ పూజారులకు ఆపద వచ్చిన, దీప దూప సంఘం నాయకులు మద్దతు ఉంటుందని వారు తెలిపారు.











