హాలియా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:24
జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, హాలియా మున్సిపాలిటీ పరిధిలో రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు (ఆర్ వో ఎస్), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏ ఆర్ వో ఎస్) మరియు ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్స్ (టి ఓ టి ఎస్)లకు సంబంధించి మున్సిపల్ స్థాయి శిక్షణ సమావేశం నిర్వహించబడింది.
ఈ శిక్షణ కార్యక్రమం హాలియా మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్‌లో విజయవంతంగా నిర్వహించబడింది. సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పాటించవలసిన విధానాలు, బాధ్యతలు మరియు నిబంధనలపై సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించబడినవి.
ఈ శిక్షణ సమావేశం ఎన్నికల ప్రక్రియను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంతో ఉపయుక్తంగా నిలిచిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.












