సమస్యల వలయంలో సంజీవరెడ్డి కాలనీ.
*-మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం లో భాగంగా*
*-బీజేపీ నాయకులు ఎన్నికల కో కన్వీనర్ మధుసూదన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో*
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం లోని వడ్డేపల్లి మున్సి పాలిటీ పరిధిలోని 3వార్డుసంజీవరెడ్డి కాలనీ లో బీజేపీ 3వార్డు కౌన్సిలర్ అభ్యర్థిబోయవెంకటేశ్వర్లుముఖ్యనాయకులు,కార్యకర్తలతో ఈశ్వరి మాత ఆల యం లో కొబ్బరి కొట్టి ప్రచారంమొదలు పెట్టారు . ప్రజల సమస్యలు అడిగి తేలుకొన్నారు .ప్రజలు అడుగు అడున వారి బాధలు చెప్పుకొ న్నారు ఎమ్మార్వో ఆఫీస్ ముందు,పోలీస్ స్టేషన్ పక్కన గల విధుల్లో వీధి లైట్లు లేవు,సీసీరోడ్లు లేవు ఇళ్లపక్కనేముళ్ళకంపలుఉన్నాయి,కనీసం మట్టి రోడ్లు కూడా లేదు మేము మున్సిపాలిటీ లో ఉన్నామా లేక అడ విలో ఉన్నామో మాకే తెలియదు అని వాపోతున్నారు.కాలనీ వాసులకి బీజేపీ నేతలు మా అభ్యర్థి గెలిచిన వెంటనే ఎంపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం నిధుల నుండి 3వార్డు అభివృద్ధి కోసం చేస్తాం అని హామీ ఇచ్చారువడ్డేపల్లి మున్సిపాలిటీలో ఎక్కడిక్కడ అభివృద్ధి శూన్యంగా ఉంది పేద ప్రజలకు అండగా ఉండే నరేంద్ర మోడీ గారిని చూసి మీ అమూల్యమైన ఓటుతో బీజేపీ అధికా రంలోకి రావాలని మరియు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా బోయ వెంకటేశ్వర్లు గారిని అఖండ మెజారిటీతో గెలిపిం చాలని కోరారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు బోయ రామకృష్ణ , మండల అధ్యక్షుడు బోయ నాగరాజు , , మాజీ మండల అధ్యక్షుడు నర్సింహులు, పట్టణ ప్రధాన కార్యదర్శి సంజన్న ,మోహన్ యాదవ్ , కె.అశోక్ , రాజశేఖర్ గౌడ్ , శేఖర్ ఆచారి , బోయ పరుశురాముడు , రాఘవేంద్ర , అయ్యరాజు , రవి గౌడ్, బికె శ్రీను తదితరులు పాల్గొన్నారు.












