టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం జనవరి 23:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ టి ఎన్ ఎస్ ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ ఆదేశాల మేరకు.. కర్మాన్ఘాట్ హనుమాన్ దేవాలయంలో మంత్రి నారా లోకేష్ పేరుపై అర్చన చేయించి 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది... *సవిందర్ చౌహాన్* టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ..యువ నాయకత్వానికి ప్రతీక, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!తెలుగుదేశం పార్టీ వారసత్వాన్ని గర్వంగా మోస్తూ, ఆధునిక రాజకీయాలకు కొత్త దిశను చూపుతున్న ధీశాలి లోకేష్ . కేవలం పేరుతో కాకుండా, తన పనితీరుతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.విద్యా, ఐటీ, నైపుణ్యాభివృద్ధి..
రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే కీలక రంగాలపై స్పష్టమైన దూరదృష్టితో ముందుకెళ్తున్నారు.
యువతకు అండగా..
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా, వారి ఆశయాలకు స్వరం ఇస్తూ ప్రజాక్షేత్రంలో నిరంతరం శ్రమిస్తున్నారు.
బాధ్యతాయుత పాలన..
నిరంతర కృషి, పారదర్శకమైన నిర్ణయాలతో కొత్త తరం నమ్మకానికి నిలువెత్తు రూపంగా నిలిచారు.
రాష్ట్రాభివృద్ధి పథంలో మీ నాయకత్వం మరిన్ని వెలుగులు నింపాలని, మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో డిజె శివకుమార్, మురళీధర్, సాయిరాం, చౌట గణేష్, జయేందర్, పరమేష్, మహేష్, వినయ్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












