పాఠశాల విద్యార్థులకు సైన్స్ మెటీరియల్ అందజేత
ప్రజా గొంతుక న్యూస్ జగిత్యాల
జగిత్యాల పట్టణ గీతా విద్యాలయం హై స్కూల్ 2002- 2003 బ్యాచ్ చదివిన విద్యార్థులు పాఠశాల కు 20వేల రూపాయల విలువైన సైన్స్ ల్యాబ్ మెటీరియల్ ని ప్రిన్సిపల్ శివకుమార్ కి అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి మెక్కొండ రాజశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థుల మేదో సంపత్తి కి ఎంతో ఉపయోగపడే సైన్స్ ల్యాబ్ మెటీరియల్ ని మా పాఠశాలకు అందజేయడం సంతోషంగా ఉంది అని అన్నారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కంచర్ల సతీష్, దుబ్బాక విజయ్, కంకణాల జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.












