జాతర సమయంలో నిబంధనలను ఆలయ కమిటీ కి సూచనలు చేసిన డిసిపి,ఏసిపి...
ప్రజా గొంతుక జనవరి 22 కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జాంపేట గ్రామంలోని మిని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులను డిసిపి రామ్ రెడ్డి, ఏసిపి గజ్జి కృష్ణ, కలిసి గురువారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాల,దుకాణాల ఏర్పాటు పై ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామ సర్పంచ్ కి సూచనలు చేశారు. జాతర సమయంలో తోపులాట లు జరగకుండా పటిష్ట బందోబస్తు కొరకు పోలీసులను ఆదేశించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. జాతర పోస్టర్ ఆవిష్కరించారు.వారి వెంట ఎస్సై సులువ వెంకటేష్, శ్రీరాంపూర్ మండల పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్, సర్పంచ్ శైలజ సదానందం, అభివృద్ధి కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు,తదితరులు ఉన్నారు.













