E-PAPER

పల్లా అంటేనే సర్పంచులకు ధైర్యం…

Date : 22 January 2026, 6:24 pm Posted By : PRAJA GONTHUKA

పల్లా అంటేనే సర్పంచులకు ధైర్యం…

పల్లా అంటేనే సర్పంచులకు ధైర్యం....

అడిగిన వెంటనే సహాయం అందించే ఎమ్మెల్యే...

వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలంబిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం లక్ష్మాపురం గ్రామంలో ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయగావాటర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నూకల కల్పన రాజిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఉన్నారనే ధైర్యంతోనే హామీలు ఇవ్వడం జరిగిందని, ఆ హామీలుఒక్కొక్కటినెరవేర్చుకుంటూ వస్తున్నామని, పల్లా అంటే ధైర్యం ధైర్యం అంటేనే పల్లా అని ధీమా వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ రిపేర్ సమస్యతో చెత్తాచెదారం తొలగించడంలో ఇబ్బందులు పడుతున్నామని దానికి అవసరమైన ఆర్థిక స్తోమత లేదని తెలియజేయడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 30 వేల రూపాయలు అందించారు. అక్కడే ఉన్న గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వృద్ధ దంపతులు వారి సమస్య తెలియజేయడంతో వారికి ఐదు వేల రూపాయల అందించారు. మల్లవరం వెంకటేశ్వర్ రెడ్డి తన తండ్రి మల్లవరం రమేష్ రెడ్డి జ్ఞాపకార్థం లక్ష్మాపురం గ్రామ ప్రజలకు ఉచితంగా వాటర్ ప్లాంట్ అందించారని ఎమ్మెల్యే పల్లా తెలిపారు. గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేసిన ఈ సేవా కార్యక్రమంఅభినందనీయమన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తాగునీరు అందించిందని గుర్తు చేశారు. ఆ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడుఎండి ఫిరోజ్ , సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, సర్పంచులు కల్పన రాజిరెడ్డి,ఆరేరవికుమార్, కళ్యాణి పరుశురాములు, కవిత మురళి, మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి,ఇర్రి రమణారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, చల్ల శ్రీనివాసరెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి ఉప సర్పంచ్లు ,వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

పల్లా అంటేనే సర్పంచులకు ధైర్యం….

అడిగిన వెంటనే సహాయం అందించే ఎమ్మెల్యే…

వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్