విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్
రామాజీపేట గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలకు 'రామాజీపేట దుబాయ్ వారథి సంఘం' సభ్యులు విద్యార్థుల క్రీడల కొరకు గురువారం రోజున ఆర్థిక చేయూతని పాఠశాల ఉపాధ్యాయులకు అందించారు. ఈ సందర్భంగా దుబాయ్ వారథి సంఘం సభ్యుడు వట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్న వయసు నుండే విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆటలు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాయని,ఆటలతో విద్యార్థులలో పోటీ తత్వంతో పాటు క్రీడా స్ఫూర్తిని కలిగిస్తాయని,మంచి క్రీడాకారులుగా తయారవుతారని తెలిపారు.దుబాయ్ వారధి సంఘంతో పాటు మనగ్రామంలో మన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మన వంతు చేయూతను అందించాలని ఈ సందర్భంగా గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెజ్జంకి మోహన్,మాజీ సర్పంచ్ వాసవి రవి, సూర విజయ్ మరియు దుబాయి వారథి సంఘం సభ్యులు వట్టిమల్ల శ్రీనివాస్,బట్టు నరసయ్య ఇద్దం వంశీ , గ్రామ నాయకులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.











