ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి
గద్వాల: బీరెల్లి చౌరస్తా వద్ద ఆధార్ సెంటర్ ఎదురుగా మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల నుంచి ముల్కల్‌పల్లి వైపు బైక్‌పై వెళ్తున్న తలారి శ్రీను (45) ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి ట్రాక్టర్ వెనుక టైర్ల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












