E-PAPER

మద్యం తాగి వాహనం నడపరాదు.. సి ఐ గోవిందరెడ్డి

Date : 20 January 2026, 6:54 pm Posted By : PRAJA GONTHUKA

మద్యం తాగి వాహనం నడపరాదు.. సి ఐ గోవిందరెడ్డి

మద్యం తాగి వాహనం నడపరాదు.. సి ఐ గోవిందరెడ్డి

మేడిపల్లి మండలం ప్రజా గొంతుక ప్రతినిధి రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి మేడిపల్లి క్రోమా సెంటర్ వద్ద జాతీయ రోడ్డు భద్రత మహోత్సవం 2026 లో భాగంగా మద్యం తాగి వాహనం నడపరాదు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. సి ఐ గోవిందరెడ్డి మాట్లాడుతూమద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే ప్రమాదాలను ప్రజలకు వివరించడం జరిగినది. ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడపడం ద్వారా వాన దారుడు రోడ్లపై తమ విలువైన ప్రాణాలను కోల్పోవడం కాకుండా వారి కుటుంబానికి పిల్లలకు తీరని దుఃఖశోకాన్ని ఇస్తున్నాడు. మద్యం తాగడం ద్వారా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తద్వారా తన నిర్ణయ సామర్థ్యాన్ని కోల్పోతున్నాడు. ఆ క్షణంలో చిన్న పొరపాటు వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మద్యం తాగి వాహనం నడపడం అనేది చట్టపరమైన నేరం మాత్రమే కాదు తద్వారా సమాజానికి ఒక ఘోరమైన ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే క్యాబ్ గాని ,ఆటోల కానీ, మిత్రుల ద్వారా గాని మీ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి .అందుకే మీ కుటుంబం కోసం ,సమాజం కోసం ,మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే క్రమంలో వాహనదారుడు తప్పనిసరిగా ఎలిమెంట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి ,అలాగే వేగ నియంత్రణ పాటించాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు నరసింగరావు, ఉదయ్ భాస్కర్, తిరుపతి లతోపాటు పోలీస్ సిబ్బంది ప్రజలు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్