అనారోగ్యంతో భాదపడే నిరుపేద కుటుంబాలకి అమీర్ అలి ఫౌండేషన్ సభ్యుల చేయూత
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:20
గత పది సంవత్సరాలనుండి వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవరంగంలో మిత్రులని శ్రేయోభిలాషులని ప్రోత్సహిస్తూన్న హౌస్ పెయింటర్ అమీర్ అలి స్థాపించిన అమీర్ అలి ఫౌండేషన్ లోని సభ్యులు అత్యవసర పరిస్థితి లో రక్తదానం చేస్తూ చలికాలం లో నిరాశ్రయులైన వృద్ధులకూ దుప్పట్లు అందించి సేవరంగంలో యువతకు ఆదర్శం అవుతున్నారు గుర్రంపోడు మండలం మొసంగీ గ్రామంలో ఒక మహిళ కంటిచూపు లేక ఒంటరిగా ఉంటుంది అని ఆర్దీక ఇబ్బంది ఉన్న మహిళకి సహాయం అందించాలని మొసంగి గ్రామ యువత ఇచ్చిన సమాచారం తో బియ్యం నెల రోజులకి సరిపడ నిత్యవసర సరుకులు కూరగాయలు ఫ్రూట్స్ అందించటం జరిగింది అమీర్ అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్ అలి మాట్లాడుతూ ఒక్కడితో మొదలైన సేవ ఈరోజు నలభై మంది సమాజ సేవకుల సైన్యంగా మారడం అభినందనీయం ఒక నిరుపేద మహీళకి సహాయం కోసం మీకు తోచిన సహాయం అందించి మీ విలువైన సమయాన్ని సేవ కార్యక్రమం కోసం కేటాయించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఫౌండేషన్ సభ్యులు రావులపాటీ శ్రీనివాస్ మాట్లాడుతూ మొసంగి గ్రామానికి చెందిన నిరుపేద మహీళ కుటుంబానికి 25 కేజిల బియ్యం అందించిన గౌస్ బాబ అలాగే నెల రోజులకి సరిపడ నిత్యవసర సరుకులు అందించిన జానిపాష నేను సైతం చిరు సహాయం అందిస్తాను అని కూరగాయలు ఫ్రూట్స్ అందించిన అబ్దుల్ గఫూర్ సేవలు అభినందనీయం అన్నారు మొసంగీ గ్రామస్తులు ఆడేపు సంతోష్ మాట్లాడుతూ అమీర్ అలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ఆనారోగ్యంతో భాదపడుతున్నా ఒంటరి వృద్దుడికి సహాయం అందించి ఈరోజు కంటి చూపు కొల్పోయి ఆర్దీక ఇబ్బంది లో ఉన్న మహీళకి సహాయం చేసేందుకు అమీర్ అలి ఫౌండేషన్ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం లో కె. చంటి యాదవ్ ఆడేపు ప్రశాంత్ ఖాజ మైనుద్దిన్ రావులపాటీ శ్రీనివాస్ గౌస్ బాబా సంతోష్ తదితరులు పాల్గొన్నారు













