E-PAPER

ప్రజా గొంతుక క్యాలెండర్ ఆవిష్కరించిన కొమ్మూరి…

Date : 19 January 2026, 8:40 pm Posted By : PRAJA GONTHUKA

ప్రజా గొంతుక క్యాలెండర్ ఆవిష్కరించిన కొమ్మూరి…

ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం...

ప్రజా గొంతుక క్యాలెండర్ ఆవిష్కరించిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుంటూ నిస్పక్షపాతత్వం, వాస్తవికత, బాధ్యతాయుత జర్నలిజంతో పత్రికా రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రజా గొంతుక దినపత్రిక సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ప్రజా గొంతుక దినపత్రిక సీఈఓ, చీప్ ఎడిటర్ చింతల మధు కృష్ణ, ప్రజా గొంతుక దినపత్రిక రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రాంతీయ సమస్యలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే బాధ్యతను ప్రజా గొంతుక దినపత్రిక సమర్థంగా నిర్వర్తిస్తోందని కొనియాడారు. వార్తల ప్రదర్శనలో స్పష్టత, సమతుల్యత, నిజాయితీని పాటిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్థంభమని పేర్కొన్న ఆయన, ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తూ ప్రజా గొంతుక దినపత్రిక మరింత బలోపేతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మండలనాయకులు ఎండి మసూద్, బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగ రావు, పోచన్నపేట కాంటెస్ట్ సర్పంచ్ అభ్యర్థి  కొయ్యడి శ్రీనివాస్ సద్ది నరసింహారెడ్డి దత్తరపు నరేష్,మహేందర్ రెడ్డి మేడ శ్రీనివాస్,సోషల్ మీడియా నాయకులు కొక్కలకొండ బాబు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం…

ప్రజా గొంతుక క్యాలెండర్ ఆవిష్కరించిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్