ఏపీలోకి వాహనాల అనుమతి : ఎస్పీ రంగనాధ్
నల్లగొండ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులు ఇకపై ఉదయం7.00 గంటల నుండి సాయంత్రం 7.00 వరకు మాత్రమే సరిహద్దు వద్ద వాహనాలఅనుమతించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నల్లగొండ నుండిఏ.పి.లోకి వెళ్లే అన్ని వాహనాలను సాయంత్రం 7.00 తర్వాత ఆంధ్రాసరిహద్దులలో నిలిపివేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ నుండి వచ్చినసమాచారంతో ఈనిర్ణయం తీసుకున్నట్టు రంగనాథ్ స్పష్టం చేశారు.
రాత్రి. 7.00 గంటల తర్వాత ఆంధ్రా సరిహద్దులకు వెళ్లి ప్రయాణికులుఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. ఇక ఇదే సమయంలో నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే మార్గంలో ఉన్న నాగార్జున సాగర్ - మాచర్ల రోడ్డునుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించనందున ఆ మార్గంలోఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఏ.పి. పోలీసులు అనుమతించడం లేదని ఈవిషయాన్ని ప్రయాణికులు గమనించుకోవాలని సూచించారు.
*పాస్ ఉంటేనే అనుమతి*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసరసేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించే వారికివిధిగా పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణాన్ని వారు అనుమతించడం లేదనిఅందువల్ల ప్రయాణికులు ఆంధ్రాకు వెళ్లే సమయంలో విధిగా పాసులు సంబంధితఅధికారుల నుండి తీసుకుని ప్రయాణం చేయాలని జిల్లా ఎస్పీ రంగనాధ్సూచించారు.













