పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జిల్లాలో ఈనెల 25 నుండి లాక్ డౌన్నువిధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి తెలిపారు.ఈమేరకు నిబంధనలను విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూలాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు
* ఈనెల 25 నుండి ఉదయం 6 నుండి 11 గంటల వరకూ మాత్రమే ప్రజలుబయటకు వచ్చేందుకు అనుమతి* దేవాలయాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటివి కూడా కేవలం 6 నుండి11 గంటల వరకూ మాత్రమే తెరవాలి* ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు యధావిధిగా పనిచేసుకోవచ్చు.* పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, కళాశాలలు మూసివేయాలి* రెస్టారెంట్లు, హోటళ్లలో ఉదయం 11 గంటల వరకూ మాత్రమే పార్సిల్స్కు అనుమతి* జిల్లా నుండి ఇతర జిల్లాలకు ఎటువంటి రవాణా సౌకర్యం లేదు.(మెడికల్మినహాయించి)* లిక్కర్, పాన్, గుట్కా లకు పబ్లిక్ స్థలాలలో అనుమతి లేదు.* ఉదయం 11 గంటల వరకూ మాత్రమే లిక్కర్ దుకాణాలకు అనుమతి* ఉదయం 11 తరువాత బయటకు వస్తే కేసులు నమోదు చేస్తారు.
లాక్ డౌన్ వివరాలు వెల్లడిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి















