కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ అనేయువకుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అతడికి నచ్చినట్లుగావివాదస్పదమైన పోస్టింగ్‌లు పెడుతున్నాడు. వీటితోపాటు వాట్సాప్‌గ్రూప్‌ల్లోనూ ఇష్టానుసారంగా పోస్టు పెడుతుండటంతో సంచలనంగా మారాడు.చివరకు అతనంటే గిట్టని వారో, అతడి పోస్టింగ్‌ల వల్ల ఇబ్బంది పడ్డారోతెలియదుకాని చంపి పూడ్చి పెట్టారు.
గత నాలుగు రోజులుగా నవీన్ కనిపించకపోవడంతో అతడి తల్లి నందిగామపోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణప్రారంభించారు. నందిగామ కాకతీయ స్కూల్‌రోడ్డులో పాతిపెట్టి ఉన్న నవీన్‌మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ కేసులో ఉన్నదెవరనే కోణంలో దర్యాప్తుముమ్మరం చేసిన పోలీసులు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు.ఇదిలా ఉండగా మృతుడు గంటా నవీన్‌పై నందిగామ స్టేషన్‌లో గతంలోనే రౌడీషీట్ తెరిచారు.













