ముంబై సభ విజయవంతం చేయాలి బండారి సురేందర్
*ప్రజాగొంతుక మార్చి 25 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి ప్రసాద్
ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఏప్రిల్ 7న ముంబైలో నిర్వహించనున్న జాతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోంపెల్లి అన్వేష్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్ మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ముంబైలో జరిగే జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని తీర్పు ఇచ్చినప్పటికీ దేశంలోని 29 రాష్ట్రాల్లో అమలు జరగడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో ముంబైలో జరిగే జాతీయ సమావేశం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. మండల స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి భారీగా ప్రజలను తరలించేందుకు కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు ఎం.డి. శంషుద్దీన్, విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల బాబు, మండల ప్రధాన కార్యదర్శి చిలుక రాజు మాదిగ, ఉపాధ్యక్షులు సింగారపు పవన్ మాదిగ, పుట్ట ప్రణయ్ మాదిగ, పుట్ట ప్రభాకర్ మాదిగ, బొడ్డు దీపక్ మాదిగ, మల్లెపల్లి అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు....











