జాతీయ స్థాయికి ఎంపికైన మహాత్మ జ్యోతిబాపూలే తుమ్మడం విద్యార్థినులు....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:25
జనవరి నెలలో మహబూబ్ నగర్లో జరిగిన జూనియర్ నెట్ బాల్ టోర్నమెంట్ నందు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైనారు ఎంపికైన విద్యార్థులు వి. దీక్ష శ్రీ, జి. నీలిమ వీరు ఈనెల 27 28 29 తారీకులలో ఉత్తరప్రదేశ్ లో జరిగే జాతీయస్థాయి నెట్ బాల్ టోర్నమెంట్ కు వెళ్ళనున్నారు వీరిని మహాత్మ జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్, ఎం.లలిత మరియు ఫిజికల్ డైరెక్టర్, కె. కనకదుర్గ మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు











