పోగొట్టుకున్న 3 ఫోన్లని బాధితులకి అప్పగించిన ఎస్సై చంద్ర కుమార్
ప్రజా గొంతుక న్యూస్/ సుల్తానాబాద్/ రిపోర్టర్ నూక రాందాసు
సుల్తానాబాద్ స్టేషన్ పరిధిలో గర్రెపల్లి గ్రామానికి కి చెందిన దీకొండ తిరుపతి, సుద్దాల గ్రామానికి చెందిన కాలువల నరేష్, బూపతిపూర్ గ్రామానికి చెందిని ఆత్రం ప్రకాశ్ అనే వ్యక్తులు ఫోన్లు పోగొట్టుకోవడం తో సుల్తానాబాద్ పోలీసు వారికి ఫిర్యాదు చేయగా పోలీసు వారు సిఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి ఫోన్లని గుర్తించి బుధవారం రోజున సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ బాధితులకు ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ,ఎవరైనా వారి యొక్క సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నా,దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోగలరని, ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని ఇట్టి అవకాశం ని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోగలరని సూచించారు. అదేవిధంగా ఎవరికైనా మొబైల్ ఫోన్స్,అనుమానిత వస్తువులు, ఇతర విలువైన వస్తువులు గాని దొరికినట్లైతే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలి తెలిపారు.












