నీటి సమస్యలు రావద్దంటే నీటిని పొదుపుగా వాడడమే ముఖ్యం
ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంతలు ఉండాలి
కుత్బుల్లాపూర్ మార్చ్ 24 (ప్రజా గొంతుక)
ప్రపంచ నీటి పొదుపు దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ సూరారం కాలనీలో విద్యార్థులకు వ్యాసరచన, పోటీలు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సామాజికవేత్త పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ....వర్షపు నీరే జీవనాధారమని, వచ్చిన నీటిని కాపాడుకోవడం మన ధర్మం అని, ఈరోజుల్లో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు తో భూమిలోకి నీళ్లు పోయే పరిస్థితి లేదని, అందుకోసమే మనకున్న ఏకైక మార్గం ఇంటింటికి ఇంకుడు గుంతనేనని నీటిని పొదుపుగా వాడడం మన బాధ్యతని వర్షాపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపినప్పుడే వర్షము నీరు మనకు లభిస్తుందని లేనిచో 600 అడుగుల వేసిన 6 చుక్కల నీరు రాదని,రక్తం దొరుకుతుందేమో గాని మనకు నీరు దొరకని పరిస్థితి వస్తుందని, అందువల్ల ప్రతి విద్యార్థి నీటిని పొదుపుగా వాడే విధంగా మనం అవలంబించుకోవాలని తెలియజేసారు.
మనము ఒక కేజీ, బియ్యం రైసు పండించాలంటే 250 లీటర్లు నీళ్లు అవసరం, ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు చిన్నపాటి గ్లాసులు వాడాలని పెద్ద గ్లాసులు వాడవద్దని బట్టలు ఉతికిన నీటిని మనం బాత్రూంలో వాడాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ పుణ్యవతి మాట్లాడుతూ...ప్రతి విద్యార్ధి భోజనం తరువాత భోజనానికి ముందు వాడే నీటిని మొక్కలు ఉన్నచోట చేతులు కడుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, నాగరాజు,మహేష్ బాబు,ఝాన్సీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.











