E-PAPER

హాలియా మున్సిపాలిటీలో2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం….

Date : 24 March 2026, 5:16 pm Posted By : PRAJA GONTHUKA

హాలియా మున్సిపాలిటీలో2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం….

హాలియా మున్సిపాలిటీలో2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:24

హాలియా మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం – 2025-26 సవరించిన అంచనాలు, 2026-27 ప్రతిపాదిత బడ్జెట్‌కు ఆమోదం,హాలియా మున్సిపాలిటీలో నేడు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అధ్యక్షత వహించగా, వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్,వార్డు సభ్యులు, మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సభకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్ అంచనాలను మరియు 2026-2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్‌ను వివరంగా సమర్పించారు.

మునుపటి సంవత్సరానికి సంబంధించిన వివరాలను సభ్యులకు వివరిస్తూ, 01-04-2025 నాటికి మున్సిపాలిటీ నగదు నిల్వ రూ. 292.66 లక్షలు ఉన్నట్లు తెలిపారు. 2025-2026 సంవత్సరానికి సవరించిన ఆదాయం రూ. 308.03 లక్షలు గా ఉండగా, మొత్తం నిధులు రూ. 600.69 లక్షలు అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు.అదే కాలంలో సవరించిన వ్యయం రూ. 308.03 లక్షలు కాగా, 31-03-2026 నాటికి రూ.292.66 లక్షలు నిల్వగా ఉండనున్నట్లు సభ్యులకు తెలియజేశారు.ఈ విధంగా గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం-వ్యయాలు సమతుల్యంగా నిర్వహించబడినట్లు వివరించారు.

తదుపరి, 01-04-2026 నాటికి ప్రారంభ నగదు నిల్వ రూ. 292.66 లక్షలు గా అంచనా వేయబడినది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత ఆదాయం రూ. 357.03 లక్షలు కాగా, మొత్తం బడ్జెట్ రూ. 649.69 లక్షలు గా ప్రతిపాదించబడింది. అదే విధంగా ప్రతిపాదిత వ్యయం రూ. 357.03 లక్షలు గా ఉండగా, 31-03-2027 నాటికి రూ. 292.66 లక్షలు మిగులు నిల్వగా ఉండనున్నట్లు వివరించారు.

ఇంకా, 2026-2027 సంవత్సరానికి క్యాపిటల్ ఖాతాలో రూ. 2790.53 లక్షల ఆదాయం/వ్యయాలు ప్రతిపాదించబడినవి. డిపాజిట్లు మరియు అప్పుల కింద రూ. 48.00 లక్షలు చూపించబడినవి.

ఈ బడ్జెట్‌లో పట్టణ అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పార్కుల అభివృద్ధి, పచ్చదనం మరియు ప్రజా సౌకర్యాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడినట్లు తెలిపారు.

పురపాలక సంఘం చట్టం, 2019 లోని సెక్షన్ 107 మరియు 108 ప్రకారం, 2025-2026 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు 2026-2027 సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించి, ప్రభుత్వం వారికి పంపించేందుకు నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ, “పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సౌకర్యాల విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర బడ్జెట్ రూపొందించబడింది” అని తెలిపారు. వైస్ చైర్మన్ మరియు వార్డు సభ్యులు , హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి తమ సూచనలు తెలియజేయగా, కమిషనర్ బడ్జెట్ అమలులో సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు.

సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :