*వడ్డెర కార్పొరేషన్ కోసం అసెంబ్లీ ముట్టడి నాయకుల అరెస్ట్*
ప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి (ప్రసాద్):
వడ్డెర కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మందితో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు వడ్డెర నాయకులను అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో వడ్డెర బస్తీల్లో ఓట్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను విస్మరించిందని విమర్శించారు. ప్రస్తుతం తమ కుల సమస్యలపై ఏ ఒక్క మంత్రి గానీ, ఎమ్మెల్యే గానీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్డెర కార్పొరేషన్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వడ్డెర రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి పల్లపు వెంకన్న, హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు మల్లికార్జున్, జిల్లా యూత్ అధ్యక్షుడు గుంజె సాయికుమార్, ఖాజీపేట మండల అధ్యక్షుడు కంది రాజుతో పాటు పలువురు వడ్డెర నాయకులు పాల్గొన్నారు.....











