ప్రభుత్వ భవనంలోకి నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం.......
ప్రారంభించిన సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్.....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్ మార్చి:23
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం గత కొన్ని సంవత్సరాలుగా అద్దె భవనంలో పని చేస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భవనంలోకి మార్చాలని ఉత్తర్వులు జారీ చేయడంతో నిడమనూరు గ్రామ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిడమనూరు సబ్ రిజిస్టర్ గాజుల దేవానంద్,మరియు కార్యాలయ సిబ్బంది సరికొండ మహేంద్రనాథ్,వంశీ,ప్రసాద్,ఫయాజ్,వీరపల్లి శ్రీనివాస్, టెక్నీషియన్ రమేష్,ఉస్మాన్,మరియు దస్తావేజు లేఖర్లు సీనియర్ రైటర్ వైద్యం నర్సయ్య, చింతకుంట్ల గోపాల్ రెడ్డి, షేక్ జహంగీర్ బాబా తదితరులు పాల్గొన్నారు











